Passport Rank : భారత్ పాస్ పోర్టుకు 82వ స్థానం

Update: 2024-07-24 13:30 GMT

ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశాల జాబితాను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేసింది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. ఇందులో గతంలో పోలిస్తే భారత్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుంది. తాజా జాబితాలో మన పాస్పోర్ట్ 82వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్లో మన దేశం 85వ స్థానంలో ఉండటం గమనార్హం. సెనెగెల్, తజకిస్థాన్ దేశాలతో కలిపి భారత్ ఈ ర్యాంకింగ్ను పంచుకుంది. మన పాస్పోర్ట్ 58 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చు. ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో సింగపూర్ అగ్ర స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్పోర్ట్ 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చని నివేదిక తెలిపింది. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత ఆస్ట్రి యా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ పాస్ పోర్టులు మూడో స్థానం దక్కించుకున్నాయి అమెరికా ఈ జాబితాలో 8వ స్థానం దక్కించుకుంది. మన పొరుగు దేశం పాకిస్థాన్ 100వ స్థానంలో ఉంది. ఆ దేశ పాస్పోర్ట్ 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లొ చ్చు. జాబితాలో అట్టడుగున 103వ స్థానంలో అఫ్గానిస్థాన్ ఉంది.

Tags:    

Similar News