DSP Deepti Sharma: డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా ప్లేయర్ దీప్తి శర్మ

ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్‌లో నియామకం.;

Update: 2025-01-31 06:45 GMT

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ క్రీడల్లో భారతదేశానికి చేసిన సేవలకుగాను ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా నియమితులయ్యారు. దింతో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రెండో భారత క్రికెటర్‌గా దీప్తి శర్మ నిలిచింది. కొద్ది రోజుల క్రితమే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తెలంగాణలో డీఎస్పీగా నియమితులైన సంగతి తెలిసిందే.

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక క్రికెటర్‌గా దేశానికి ఆమె చేసిన కృషికి జనవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా నియమితులయ్యారు. ఐసీసీ మహిళల వన్డే, టి20 ఇంటర్నేషనల్ టీమ్‌లలో ఎంపికైన దీప్తి జనవరి 29, బుధవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను పంచుకున్నారు. తనకు కల్పించిన గౌరవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. దీప్తి శర్మ ఖాకీ యూనిఫాం ధరించిన కొన్ని చిత్రాలను పంచుకుంటూ, తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పోటోలను షేర్ చేస్తూ.. “ఈ గొప్ప మైలురాయిని సాధించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని.. వారి మద్దతు, ఆశీర్వాదాలు నాకు ప్రేరణగా నిలిచాయని అన్నారు. ఈ అవకాసాన్ని ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అంటూ తెలిపింది. ఉత్తరప్రదేశ్ పోలీస్‌లో డీఎస్పీగా ఈ కొత్త బాధ్యతను స్వీకరిస్తూ.. నా విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ, నిజాయితీతో సేవ చేయడానికి పూర్తిగా అంకితం అవుతానని రాసుకొచ్చింది.

Tags:    

Similar News