Indian Military : మాలీవుల్ని వీడిన భారత సైనిక సిబ్బంది

Update: 2024-03-12 09:23 GMT

మే 10 నాటికి ద్వీపసమూహం విడిచిపెట్టాలని చైనా (China) అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు (Mohammad Muyiz) ఆదేశించిన తర్వాత మాల్దీవుల నుండి భారత్ తన దళాలను ఉపసంహరించుకోవడం ప్రారంభించిందని స్థానిక మీడియా నివేదించింది. భారతదేశం, మాల్దీవులు రెండూ అంగీకరించిన ఉపసంహరణ అధికారికంగా మార్చి 10కి ముందే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మాల్దీవుల నేషనల్ ఢిపెన్స్ ఫోర్స్ ప్రతినిధిని ఉటంకిస్తూ స్థానిక మీడియా ఈ విషయాన్ని వెల్లిడించింది.

మహమ్మగ్ మయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. తమ దేశంలో విధులు నిర్వర్తిస్తోన్న భారత బలగాలు మే 10నాటికి వెనక్కి వెళ్లిపోవాలని ఆయన సూచించారు. ఆ తర్వాత ఆ దేశానికి చెందిన ఒక్క మిలిటరీ సిబ్బంది కూడా తమ భూభాగంలో ఉండకూడదన్నారు. కనీసం సివిల్ డ్రెస్సుల్లో కూడా ఇక్కడ సంచరించొద్దంటూ నోరుపారేసుకున్నారు. అయితే తమ బలగాల స్థానంలో నమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు దిల్లీ పెట్టిన షరతును మాలే అంగీకరించింది. దీంతో గత వారమే భారత సాంకేతిక బృందం ఆ దీవులకు చేరుకుంది.

Tags:    

Similar News