Indian Rupee : రూపాయి విలువ ధమాల్.. డాలర్ కు రూ.80.02
Indian Rupee : రికార్డుస్థాయిలో రూపాయి ఢమాలైంది. పదేళ్లలో తొలిసారి భారీ ఎత్తున రూపాయి పతనమైంది.;
Indian Rupee : రికార్డుస్థాయిలో రూపాయి ఢమాలైంది. పదేళ్లలో తొలిసారి భారీ ఎత్తున రూపాయి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 80 రూపాయలు దాటింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 80.01గా ఉంది. అదే సమయంలో చరిత్రలో తొలిసారి డాలర్ విలువ 80 రూపాయల మార్క్‌ను దాటింది.
రూపాయి విలువ పతనం కావడంతో వంట నూనెలు, బంగారం, క్రూడాయిల్, ఇతర దిగమతులు మరింత ప్రియం కానున్నాయి. అలాగే ద్రవ్యలోటు కూడా భారీగా పెరగనుంది.ఇప్పటికే వరుసగా నాలుగు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
దీనికి తోడు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు సహా అన్ని రకాల వస్తువుల రేట్లు ఆకాశన్నంటుతున్నాయి.వీటికి తోడు ఇప్పుడు రూపాయి విలువ భారీ స్థాయిలో పతనం కావడంతో అన్ని రకాల వస్తువులు మళ్లీ మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే సామాన్య ప్రజలకు మరింత ఇబ్బందులు తప్పవు.