Kashmir : ఈసారి కశ్మీర్ లోయ ఓట్లు ఎవరికో?

Update: 2024-04-02 11:18 GMT

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో జరగనున్న తొలి లోక్‌సభ ఎన్నికలు కావడంతో అక్కడి ప్రజల తీర్పుపై ఆసక్తి నెలకొంది. జమ్మూలో పట్టు సాధించిన బీజేపీ కశ్మీర్‌లోనూ ఖాతా తెరవాలనుకుంటోంది. గుజ్జర్లు, ST వర్గంలో చేర్చినందుకు పహారీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారనేది బీజేపీ అంచనా. అనంత్‌నాగ్ నియోజకవర్గంలోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో వీరి ఓటు బ్యాంక్ ఎక్కువ. బారాముల్లాలో సైతం వీరి ఓటు బ్యాంక్ ఉంది.

ఇక శ్రీనగర్‌లో ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాలు నేషనల్ కాన్ఫరెన్స్ గుప్పిట్లో ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ఈ పార్టీ మరోసారి ఇక్కడ గెలవాలని భావిస్తోంది. ఇండియా కూటమిలో NC, PDP భాగమైనా.. సీట్ల పంపిణీకి NC ససేమిరా అంటోంది. అనంతనాగ్ సీటు పీడీపీకి కేటాయించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించి ఒంటరి పోరుకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో పీడీపీ ఒంటరి పోరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ NC, PDPలు… సమర్థిస్తూ బీజేపీ కశ్మీర్‌లో పోటీకి దిగనున్నాయి. మరోవైపు జమ్మూలో ఈసారి గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తోంది. లద్ధాక్‌లో స్థానికుల నిరసన ఎన్నికలపై ప్రభావం చూపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ రైట్స్‌పై స్థానికులు పోరాడుతున్నారు.

Tags:    

Similar News