ఉగ్రదాడి తర్వాత పాక్‌పై దౌత్యచర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 24, 2021న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయనున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఉగ్ర సంస్థలు కశ్మీర్‌లోకి చొరబడటంతోపాటు తరచూ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసి మన సైన్యానికి అదనపు బలం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.
పాకిస్థాన్‌పై విరుచుకుపడేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. LoC, అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ నిబంధనలు ఉల్లంఘించడంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని (సీజ్ ఫైర్) రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అటు హిందూ, అరేబియా సముద్రాల్లో నేవీ మోహరించినట్లు వార్తలొస్తున్నాయి. INS విక్రాంత్ పాకిస్థాన్ వైపు వెళ్తోందని సమాచారం. ఇక వైమానిక దళం రఫేల్ యుద్ధవిమానాలను పలు ఎయిర్‌బేస్‌లకు తరలించింది.
లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. ఉగ్రదాడి జరిగిన పహల్గామ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. ముష్కరుల దాడి సమయంలో అమెరికాలో ఉన్న రాహుల్ ఆ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసి భారత్‌కు వచ్చారు. కాగా నిన్న జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.