Vice President : ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌..

Vice President : ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఖరారు అయ్యారు.;

Update: 2022-07-16 15:21 GMT

Vice President : ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఖరారు అయ్యారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ పేరును జేపీ నడ్డా ప్రకటించగా.. ఎన్డీఏ మిత్రపక్షాలు సమ్మతించాయి. ప్రస్తుతం బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్న జగదీప్‌ ధన్‌ఖడ్‌.. గతంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు.

రాజస్తాన్‌లోని కితానాలో 1951, మే 18న జగదీప్‌ ధన్‌ఖడ్‌ జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. కష్టపడి న్యాయవిద్యను అభ్యసించారు. ప్రసిద్ధ లాయర్‌గా పేరుపొందిన ఆయన.. రాజస్తాన్‌ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను పనిచేశారు. ఆ తర్వాత 1989లో జనతాదళ్ తరుపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

1989-91 మధ్య కేంద్రమంత్రిగాను పనిచేశారు. ఆ తర్వాత 1993-98 మధ్య కిషన్‌ఘర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇక 2003లో జగదీప్‌ ధన్‌ఖడ్‌ బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం పశ్చిమబెంగాల్ గవర్నర్ గా జగదీప్‌ ధన్‌ఖడ్‌ కొనసాగుతున్నారు.

Tags:    

Similar News