దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు కావడంతో ఆ చీకటి రోజులకు వ్యతిరేకంగా ఎన్డీయే నిరసనలు చేపట్టింది. రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు గతంలో జరిగిన వాటికి బాధ్యత కూడా తీసుకోవాలని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ( Kangana Ranaut ) అన్నారు.
తాతలు, తండ్రుల పేరుతో ఓట్లడిగే నేతలు తమ పూర్వీకులు చేసిన తప్పులకు బాధ్యత తీసుకోవాలని బాలీవుడ్ క్వీన్ చురకలు వేశారు. గతంలో తమ తాతలు, తండ్రుల హయాంలో ప్రజాస్వామ్యానికి ఎలా తూట్లు పొడిచేరా స్వయంగా తమ ట్రాక్ రికార్డ్ను గురించి పరిశీలించుకోవాలని ఆమె హితవు పలికారు.
ఇక 18వ లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లా తనకు మరోసారి స్పీకర్ గా అవకాశం ఇచ్చిన సభ్యులం దరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని లోక్సభ ఖండిస్తున్నదని ప్రకటించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన నాయకులను అభినంది స్తున్నదని చెప్పారు. అనంతరం సభను వాయిదా వేశారు. ఇటీవల ఇందిరా ఎమర్జెన్సీ మూవీలో కంగనా నటించారు.