Kangana Ranaut : దేశం చాలా ఇచ్చింది తిరిగి ఇచ్చేస్తా : కంగనా రనౌత్

Update: 2024-02-29 04:55 GMT

సినీ ఇండస్ట్రీలో యువ నటులు చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీలో ఇప్పటికే పార్టీ స్థాపించి ఓ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. మరో సారి బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా తమిళ నటుడు విజయ్ దళపతి (Vijay thalapathy) కూడా పార్టీ స్థాపించారు. దానికంటే ముందే కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ (Stalin) కుడా డీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యే గా గెలుపొంది.. మంత్రి గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదే సమయంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కుడా పాలిటిక్స్ కి ఎంట్రీ ఇస్తారని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి.

బీజేపీ నుంచి ఆమె పోటి చేస్తారని కథనాలు వెలువడ్డాయి. తాజాగా కంగనా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 'నేను దేశం కోసం ఎంతో చేశాను. సినిమా సెట్ నుంచే రాజకీయాలతో పోరాడాను. జాతీయ వాదిగా గుర్తింపు తెచ్చుకున్నాను. 20 ఏళ్లుగా నటికంటే జాతీయ వాదిగానే అందరికీ తెలిశాను. ఒక వేళ రాజకీయాల్లోకి రావాలంటే ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను. అని చెప్పుకొచ్చింది.

దేశంలో అన్ని ప్రాంతాలతో తనకు మంచి అనుబంధముందని పేర్కొంది. నార్త్ నుంచి సౌత్ కి వచ్చి సినిమాలు చేశానని.. ఝాన్సీ రాణి వంటి శక్తివంతమైన పాత్రలోనూ నటించానని గుర్తుచేసింది. ప్రజలు తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని కంగనా పేర్కొంది. దేశం చాలా ఇచ్చిందని.. అదే దేశానికి తిరిగి ఇవ్వడం తన బాధ్యత అని చెప్పుకొచ్చింది. తనను అభిమానించే వారికి ఎప్పుడు రుణపడే ఉంటాను కంగనా వెల్లడించింది.

Tags:    

Similar News