Kerala : ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ ఉందని వందల పందులు ఒకే సారి హతం..
Kerala : కేరళలోని వయనాడ్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది.;
Kerala : కేరళలోని వయనాడ్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. స్థానికంగా ఉన్న రెండు పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. భోపాల్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూర్టీ యానిమల్ డిసీజెస్ సంస్థలో పందుల నమూనాలను పరీక్షించారు.
అయితే పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. సుమారు 300 పందుల్ని వధించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ 190 పందులను చంపేసి.. పూడ్చి పెట్టారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులో ఉందని వయనాడ్ జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.