భూఆక్రమణ కేసులో తనకు అందిన నోటీసులపై మాజీ క్రికెటర్, తృణమూల్ ఎంపీ యూసుఫ్ పఠాన్ ( Yusuf Pathan ) గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన స్థలంలోని అక్రమ కట్టడాలను 15 రోజుల్లోగా తొలగించాలంటూ ఆ సంస్థ జూన్ 6న పఠాన్ కు నోటీసులు జారీ చేసింది.
దీనిపై పఠాన్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. తాను ఇటీవల మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాననీ.. 10 సంవత్సరాలుగా ఈ విషయంలో స్పందించని సంస్థ.. ఫలితాలు వచ్చిన రెండు రోజుల తర్వాత నోటీసులు ఇచ్చిందన్నారు. ఇవన్నీ తనను వేధించే ప్రయత్నాల్లో భాగమేననీ.. వీఎంసీ తక్షణ చర్యలు తీసుకోకుండా నిరోధించాలని.. లేకపోతే బుల్డోజర్లను పంపిస్తారని కోర్టుకు చెప్పారు.
ఐతే.. అక్రమంగా కాంపౌండ్ వాల్ కట్టి యూసుఫ్ పఠాన్ వీఎంసీ స్థలాన్ని ఆక్రమించారని బీజేపీ నేతలు అంటున్నారు.