జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర వాదుల వేట కొనసాగుతోంది. పహల్గాంలో ఉగ్రదాడి తరువాత జమ్ము , కశ్మీరు లోయ ప్రాంతాన్ని సైనం జల్లెడ పడుతోంది. ఈ నేపథ్యంలో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భారత బలగాలు మట్టుబెట్టాయి.
పహల్గాం దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడపడుతున్న భద్రతా దళాలకు బందీపొరాలో అల్తాఫ్ ఆచూకీ కనిపెట్టింది. అతని కోసం ఉదయం ఆర్మీ-పోలీసు దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈక్రమంలో ఎన్‌కౌంటర్ మొదలైంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్‌లో అడుగుపెట్టిన వేళ ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం.