ఆరునెలలు జైలుకు వెళ్లొచ్చిన లీడర్ హీరో అవుతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. జైలుకు వెళ్లాలంటే లీడర్లు భయపడే పరిస్థితి రావాలన్నారు. నల్సార్ వర్సిటీ నిపుణులు చెప్పినట్టు బ్రిటీష్ కాలం నాటి చట్టాలను మార్చాలని కోరారు.
నయీమ్ డబ్బు, భూములు ఏమయ్యాయో ఎవరికీ తెలియదన్నారు వీహెచ్. నయీమ్ డైరీ ఎక్కడ పోయిందని అడిగారు. న్యాయ వ్యవస్థ విలువ తగ్గిపోతోందని అన్నారు వీహెచ్.
దుబాయ్ లాంటి రాష్ట్రాల్లో నేరం చేస్తే నడి బజార్లో ఉరి తీస్తారని.. జైలుకు వెళ్లాలంటే నేతలు భయపడే పరిస్థితి రావాలన్నారు వీహెచ్. రాహుల్ గాంధీ ప్రధాని అయితే చట్టాల్లో మార్పు తెస్తారని చెప్పారు.