లోక్‌సభ స్పీకర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ పదవి కోసం ఎన్నిక జరుగుతోంది. NDA అభ్యర్థిగా ఓం బిర్లా ( Om Birla ), ఇండియా కూటమి అభ్యర్థిగా కే సురేశ్ ( K Suresh ) పోటీ పడుతున్నారు. కాగా తొలిసారిగా 1952లో స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అందులో శాంతారామ్ (55)పై మౌలాంకర్ (394) విజయం సాధించారు. ఆ తర్వాత 1976లో జగన్నాథ్ రావుపై బలిరామ్ భగత్ 344 ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పుడు మళ్లీ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతోంది.
ప్రతిపక్ష ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కే సురేశ్‌ను బరిలో దించింది. దీంతో ఆయన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేరళలోని మావెలికర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొడికొన్నిల్ సురేశ్ 8 సార్లు ఎంపీగా గెలిచారు. 1989, 91, 96, 99, 2009, 14, 19, 24 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. సీబ్ల్యూసీ సభ్యుడిగా కూడా ఉన్నారు. అలాగే కేరళ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన కొనసాగుతున్నారు.