మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ( Ek Nath Shinde ) కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చెప్పిన విధంగా మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించామని, ఓబీసీ, ఇతర వర్గాల రిజర్వేషన్ లో కోత విధించకుండానే మరాఠా కోటా ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, మరాఠా కోటాను అడ్డుకోవాలని పలువురు ప్రయత్నిస్తున్నా కోర్టు స్టే ఇవ్వలేదని అన్నారు షిండే. మరాఠా రిజర్వేషన్లకు అనుగుణంగా నియామకాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. మరాఠ్వాడాలో కుంబి సర్టిఫికెట్లపై జస్టిస్ షిండే కమిటీ కసరత్తు సాగిస్తున్నదని తెలిపారు.
శనివారం నాటి సమావేశంలో ముందుకొచ్చిన అనేక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, ఆయా అంశాలపై కసరత్తు సాగిస్తుందని సీఎం షిండే తెలిపారు.