Maharashtra Government : చావా సినిమాకు మహారాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్

Update: 2025-02-20 15:45 GMT

ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ బయోపిక్ గా తెరకెక్కిన సినిమా చావా. ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న కీ రోల్ లో నటించారు. ఆ పోరాట యోధుడి కథను ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చూపించారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ఈ సినిమా దేశవ్యాప్తంగా అందరికీ మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి పన్ను మినహాయింపునిచ్చాయి. ఈ నెల 14న రిలీజైన ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. నిన్న ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. గోవాలోనూ ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఇక మహారాష్ట్రలోనూ ఈ సినిమాకు పన్ను మినహాయింపు కలిగించాలని వస్తున్న విజ్ఞప్తుల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సానుకూలంగా స్పందించారు. "ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంపై గొప్ప సినిమా తీసినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఇంకా ఈ సినిమాను చూడలేదు. చరిత్రను ఎక్కడా వక్రీకరించకుండా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

Tags:    

Similar News