Aurangabad: బంపర్ ఆఫర్..! ఆ బంకులో పెట్రోల్ లీటర్ రూ. 54 రూపాయలే..
Aurangabad: దేశంలో పెట్రోలు.. సెంచరీ ఎప్పుడో దాటేసింది. పెట్రో ధరలు భగ్గుమంటున్న వేళ నవనిర్మాణ్ సేన బంపర్ ఆఫర్ ఇచ్చింది.;
Aurangabad: దేశంలో పెట్రోలు.. సెంచరీ ఎప్పుడో దాటేసింది. పెట్రో ధరలు భగ్గుమంటున్న వేళ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన బంపర్ ఆఫర్ ఇచ్చింది. నిన్న MNS అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే 54వ పుట్టిన రోజు సందర్భంగా ఔరంగాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ను 54 రూపాయలకే అందించింది. అదీ కూడా క్రాంతిచౌక్ అనే పెట్రోల్ బంకులోనే ఈ ఆఫర్ సదుపాయాన్ని కల్పించింది. దీంతో వాహనదారులు ఎగబడ్డారు.
సగం రేటుకే పెట్రోల్ వస్తుండటంతో ఉదయం నుంచే పెట్రోల్ బంకు ముందు క్యూ కట్టారు. బంకులో ఉన్న పెట్రోల్ అయిపోయేంతవరకు ఈ ఆఫర్‌ను కొనసాగించారు. అయితే చివర్లో పెట్రోల్ అందక కొందరు నిరాశతో వెనుదిరిగారు. తమ అధినేత రాజ్‌ఠాక్రే పుట్టినరోజున ఏదైనా మంచిపని చేయాలని భావించి సగం రేటుకే పెట్రోల్‌ను అందించామని MNS పార్టీ నేతలు తెలిపారు.