పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులకు రవాణా సదుపాయం కల్పించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జులైలో ఆపరేషన్ మహాదేవ్ నిర్వహించిన భద్రతాదళాలు.....బైసరన్ లో 26మందిని పొట్టనపెట్టుకున్న ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. వాటిని ఫొరెన్సిక్ విశ్లేషణ చేసిన తర్వాత జమ్ముకశ్మీర్ పోలీసులు మహ్మద్ కటారీని అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన అందరినీ పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నక్రమంలో.....ఆపరేషన్ మహాదేవ్ తర్వాత కటారీని అరెస్ట్ చేయటం ద్వారా భద్రతాదళాలు పెద్ద పురోగతి సాధించాయి. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే-తొయిబాకు చెందిన అనుబంధ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి పాల్పడినట్లు బాధ్యత తీసుకుంది.