Mayawati : బైపోల్‌లో సత్తా చాటుతామన్న మాయావతి

Update: 2024-06-29 10:12 GMT

యూపీలో జరిగే ఉప ఎన్నికల్లో ఖాళీ అయిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) రెండూ ప్రకటించాయి. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలువని బీఎస్పీలో దీంతో కలవరం మొదలైంది. దళిత ఓటర్లు ఏఎస్పీకి మొగ్గడంపై ఆందోళన చెందుతోంది.

ఉత్తర ప్రదేశ్లో తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు లోక్ సభకు ఎన్నికయ్యారు. దీంతో 9 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. క్రిమినల్ కేసులో కోర్టు శిక్ష విధించడంతో ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకిపై అనర్హత వేటు పడింది. దీంతో కాన్పూర్లోని సిసామావు సీటు కూడా ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

పది అసెంబ్లీ స్థానాల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) కూడా సై అంటోంది.10 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ఏఎస్పీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రకటించారు.

Tags:    

Similar News