Metro Security : మహిళపై మెట్రో సెక్యూరిటీ గార్డు అసభ్య ప్రవర్తన

Update: 2024-03-20 09:18 GMT

బెంగళూరు మెట్రో సెక్యూరిటీ గార్డు (Bangalore Metro Security Guard) స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌కు ఎదురుగా నిలబడి ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలిని నిరంతరంగా చూస్తూ.. అనుచితంగా తనను తాకాడు. ఈ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ బెంగళూరు సిటీ పోలీసులను రంగంలోకి దింపింది. ఈ ఘటన జలహళ్లి మెట్రో స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై చోటుచేసుకుంది.

మెట్రో అథారిటీకి చేసిన ఫిర్యాదులో, "సెక్యూరిటీ గార్డు నిరంతరం నా వైపు చూస్తున్నాడు. ప్లాట్‌ఫారమ్‌కి ఎదురుగా నుండి అతని ప్రైవేట్ భాగాలపై చేతులు ఉంచడం వంటి కొన్ని సంజ్ఞలు చేశాడు"అని ఆ మహిళ పేర్కొంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అంటే పట్టపగలే ఈ ఘటన జరిగినందున ఈ సంఘటన తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని మహిళ తెలిపింది.

"నేను అతనిని అడగడానికి ప్రయత్నించాను, కానీ అతను అప్పటికీ నా వైపు చూస్తూ సైగలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి, నేను వీడియో షూచ్ చేయడం ప్రారంభించాను. అతను పక్కకు తప్పుకున్నాడు" ఆమె జోడించింది. ఈ ఘటన తనకు అభద్రతా భావాన్ని కలిగించిందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఈ సమయంలో మెట్రో అథారిటీ స్పందించడంలో విఫలమవడంతో, మహిళ రెండవ ఫిర్యాదును పంపింది. ఇప్పుడైనా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా అని తెలుసుకోవాలని కోరింది.

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ మహిళ.. వీడియోను కూడా షేర్ చేసింది. ఈ సోషల్ మీడియా పోస్ట్‌పై బెంగుళూరు సిటీ పోలీసులు త్వరగానే స్పందించారు. ఫిర్యాదు అవసరమైన చర్య కోసం సంబంధిత పోలీసు అధికారులకు ఫార్వార్డ్ చేయబడింది అని చెప్పారు. అనంతరం ఆ మహిళ వివరాలను పంచుకోవాలని కూడా కోరింది.

Tags:    

Similar News