మోడీ గుడ్‌న్యూస్‌.. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఒకేసారి రాయొచ్చు

Update: 2024-02-20 06:57 GMT

2025-26 అకడమిక్ సెషన్ నుండి విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తెలిపారు. 2020లో ఆవిష్కరించబడిన కొత్త జాతీయ విద్యా విధానం (NEP) యొక్క లక్ష్యాలలో ఇది ఒకటి. విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించడమే దీని లక్ష్యం.

ఛత్తీస్‌గఢ్‌లో PM SHRI (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ప్రారంభించిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయం చెప్పారు. రాయ్‌పూర్‌లోని (Raipur) పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం పాఠశాలలో 10 బ్యాగులు లేని రోజులను ప్రవేశపెట్టాలనే భావనను హైలైట్ చేసిన మంత్రి, ఇతర కార్యక్రమాలతో పాటు కళ, సంస్కృతి, క్రీడలతో విద్యార్థులను నిమగ్నం చేయాలని నొక్కి చెప్పారు.

ఈ స్కీమ్ ప్రకారం.. 2025 - 26 విద్యా సంవత్సరం నుంచి దేశంలో 10, 12 వ తరగతి విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు రాయవచ్చు. ''రెండు సార్లు పరీక్షలు రాసి, మెరుగైన స్కోరు ఉంచుకోవచ్చు. దీని ద్వారా విద్యార్థుల విద్యా ఒత్తిడి తగ్గుతోంది. ఇది తప్పనిసరి కాదు'' అని మంత్రి చెప్పారు.

Tags:    

Similar News