PM Modi : పుతిన్‌తో మోదీ చర్చలు

Update: 2024-10-23 13:45 GMT

16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలోని కజాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఇతర దేశాధినేతలతో ప్రధాని సమావేశం కానున్నట్లు సమాచారం. రష్యాకు చేరుకున్న అనంతరం ప్రధాని మోదీకి అక్కడ లభించిన సాదర స్వాగతంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ‘బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం అందమైన కజాన్ నగరాన్ని సందర్శించినందుకు సంతోషిస్తున్నాను. రష్యాతో భారతదేశానికి చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొత్త భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ఆ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. ‘బ్రిక్స్‌’ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ‘ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం’ ఈ ఏడాది సదస్సు ప్రధాన నినాదం. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇతర నేతలు పాల్గొంటారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్‌ కూటమి ఏర్పాటైంది.

Tags:    

Similar News