ప్రధాని నరేంద్రమోదీ మే 1, 2 తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను ఈ సందర్భంగా ప్రధాని ప్రారంభిస్తారు. 25 దేశాలకు చెందిన మంత్రుల భాగ స్వామ్యంతో గ్లోబల్ మీడియా డైలాగ్ సదస్సు నిర్వహిస్తుంది. ఆ తర్వాత కేరళకు వెళ్లి అక్కడ నిర్మించిన విజింజం అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును జాతికి అంకితం చేయనున్నారు. ఇది మన దేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి కంటైనర్ ట్రాన్సప్మెంట్ పోర్ట్.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆయన అమరావతిలో రూ. 58వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారం భోత్సవాలు చేయనున్నారు.