కొత్తగా ఎన్నికైన 543 మంది ఎంపీల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్నవాళ్లే 105 మంది ఉన్నారు. మొత్తం ఎంపీల్లో వీరు 19శాతం ఉన్నారు. 5వ తరగతి వరకు చదివిన వారు ఇద్దరు, నలుగురు 8వ తరగతి చదివారు. 34 మంది 10వ తరగతి వరకు. 65 మంది 12వ తరగతి వరకు చదివినట్లు ప్రకటించారు.
420 మంది (77 శాతం) మంది గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగివున్నారు. 17 మంది అభ్యర్థులు డిప్లొమా హోల్డర్లు అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది.
ఛత్తీస్ గఢ్ నుంచి 91 శాతం, మధ్యప్రదేశ్ నుంచి 72 శాతం, గుజరాత్ నుంచి 65 శాతం ఎంపీలు వ్యవసాయాన్ని తమ వృత్తిగా పేర్కొన్నారు. 7 శాతం మంది న్యాయవాదులు, 4 శాతం మంది వైద్య నిపుణులు ఉన్నారు. 5 శాతం మంది డాక్టర్ డిగ్రీలు చదివిన ఎంపీల్లో ముగ్గురు మహిళా ఎంపీలు కూడా ఉన్నారు.