Kangana Ranaut : రాజకీయ నేతలు పానీపూరీ అమ్ముకోవాలా? : ఎంపీ కంగన

Update: 2024-07-19 06:24 GMT

జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా నిలిచారు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేయకుండా పానీపూరీ అమ్ముకోవాలా? అని ముక్తేశ్వరానందను కంగనా ప్రశ్నించారు.

ఉద్ధవ్ ఠాక్రే నమ్మకద్రోహ బాధితుడని, ఏక్ నాథ్ షిండే హిందూ ద్రోహి అని అవిముక్తేశ్వరానంద సరస్వతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. స్వామీజీ వ్యాఖ్యలపై పలువురు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటరిచ్చారు.

రాజకీయాల్లో పొత్తులు, పార్టీల విభజన సర్వసాధారణమన్న కంగనా.. 1907లొ ఒకసారి, 1971లో మరోసారి కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన విషయాన్ని ఎక్స్ లో తన పోస్టు ద్వారా కంగనా గుర్తుచేశారు. "రాజకీయ నాయకులు రాజకీయాలే చేస్తారు. వాళ్లు రాజకీయం చేయకుంటే గోల్ గప్పాలు అమ్ముతారా?" అని ప్రశ్నించారు. స్వామి అవిముక్తేశ్వరానంద తన మాటలను దుర్వినియోగం చేశారని, ఏక్నాథ్ షిండేను ద్రోహి అనడం ద్వారా హిందువుల మనోభావాలను స్వామీజీ దెబ్బతీశారని పేర్కొన్నారు.

Tags:    

Similar News