అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలోని ఎన్సీపీలోకి మారిన కొద్ది రోజులకే బాబా సిద్ధిక్ ఎమ్మెల్యే కుమారుడు జీషన్ సిద్ధిక్‌పై కాంగ్రెస్ చర్యలు తీసుకుంది. ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి జీషన్‌ను బుధవారం తొలగించారు. ఆయన స్థానంలో అఖిలేష్ యాదవ్‌ను నియమించినట్లు కాంగ్రెస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
అతని కుమారుడు జీషన్ సిద్ధిక్, ప్రస్తుతం బాంద్రా (తూర్పు) నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. అతని తండ్రి మారడానికి ముందు పవార్, ఇతర నాయకులను కలిశారు. సీనియర్ సిద్ధిక్‌ను ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సునీల్ తట్కరేతో సహా ఎన్‌సీపీ అగ్రనేతలు పార్టీలోకి ఆహ్వానించారు.
సిద్ధిక్ ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్‌ను వీడారు. ఈ సందర్భంగా సిద్ధిక్ మాట్లాడుతూ, తన రాజకీయ జీవితంలో దివంగత కాంగ్రెస్ ఎంపీ సునీల్ దత్ పాత్రను గుర్తించాడు. ఎన్‌సిపిలో చేరే ముందు తన ఎమ్మెల్యే కుమారుడు జీషన్ సిద్ధిక్, కాంగ్రెస్ మాజీ ఎంపి ప్రియా దత్‌లను సంప్రదించినట్లు సిద్ధిక్ తెలిపారు. ముంబై కాంగ్రెస్‌కు చెందిన ఈ ప్రముఖ వ్యక్తి.. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్‌సీపీ సంకీర్ణం అధికారంలో ఉన్నప్పుడు సిద్ధిక్ మంత్రిగా కూడా పనిచేశారు.