Mayawati : నా వారసుడు ఆకాశ్ ఆనందే! మాయావతి స్పష్టీకరణ

Update: 2024-06-24 07:52 GMT

తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ( Akash Anand ) పై బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి అలకవీడారు. ఆకాశ్ ఆనంద్ ను తన వారసుడిగా నియమించారు. అలాగే, పార్టీ జాతీయ సమన్వయకర్తగా కూడా బాధ్యతలు కూడా అప్పగించారు.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు మాయావతి ఈ ప్రకటన చేశారు. దాంతో మాయావతి పాదాలను తాకి ఆశీర్వదించాలని ఆకాశ్ కోరడంతో... దీదీ ఆనందంతో ఆయన తలపై చేయి వేసి ఆశీర్వదించారు. అదేవిధంగా ఆకాశ్ ను త్వరలో జరుగనున్న ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాంపెయినర్ ఎంపికచేశారు. 2019లో ఎస్పీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత పార్టీని పటిష్టపరచడంపై దీదీ దృష్టిసారించారు. మేనల్లుడు ఆకాశ్ ను పార్టీ సమన్వయకర్తగా నియమించారు.

ఎన్నికల ప్రచారం సమయంలో సీతాపూర్ లో వివాదాస్పద ప్రసంగం చేయడంతో ఆమె ఆకాశ్ ను ఆ పదవి నుంచి తప్పించారు. తన రాజకీయ వారసుడిగా ప్రకటించి పార్టీలో తగిన స్థానం కల్పించిన మాయావతి.. ఇప్పుడు తాజా స్టేట్ మెంట్ తో మాట నిలబెట్టుకున్నారు.

Tags:    

Similar News