ఇంట్లోనే నాగ పంచమి వేడుకలు.. నిజమైన నాగుకు పూజలు..

నాగ పంచమి, నాగుల చవితి.. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే పండుగలు..

Update: 2023-08-22 05:39 GMT

నాగ పంచమి, నాగుల చవితి.. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే పండుగలు.. సాధారణంగా విగ్రహాలకు పూజలు చేస్తారు.. పుట్టలో పాలు పోస్తారు.. కానీ నిజంగా పాము కనిపిస్తే భయభ్రాంతులకు గురవుతారు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అంతదూరం పరిగెడతారు ఎంత భక్తులైనా. అయితే నాగ పంచమి సందర్భాన్ని పురస్కరించుకుని నిజమైనా నాగుపాముకి పూజ చేసి హారతులు ఇచ్చారు ఆ తండ్రి ఇద్దరు పిల్లలు.. ఏ మాత్రం భయపడకుండా పూజ చేయడం, పాముకు పూలమాల వేయడం చూసే వారిని ఆశ్చర్య చకితుల్ని చేసింది.

ఉత్తర కన్నడ జిల్లా శిరసికి చెందిన ప్రశాంత్ హులేకల్ అనే వ్యక్తికి పాములంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం నాగుల పంచమిని తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటాడు. ప్రత్యేకంగా పాముని ఇంటికి తీసుకొచ్చి పూజిస్తారు. ఈసారి మరింత ప్రత్యేకంగా.. పాము పిల్లకు పూజలు చేశారు. పాములను రక్షించండి అంటూ సమాజానికి సందేశం ఇచ్చేందుకే ఇలా చేస్తున్నానని ప్రశాంత్ తెలిపారు. గత 35 సంవత్సరాలుగా, అతను సరీసృపాల సంరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News