Narendra Modi: అందులో మోడీదే మొదటి స్థానం.. అమెరికా సంస్థ వెల్లడి..
Narendra Modi: భారత ప్రధాని మోడీని 75 శాతం ప్రజలు ఆమోదిస్తున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ తెలిపింది.;
Narendra Modi: భారత ప్రధాని మోడీని 75 శాతం ప్రజలు ఆమోదిస్తున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ తెలిపింది. ప్రపంచ నాయకుల్లో అత్యంత ప్రజామోదం ఉన్న నేతగా మోడీనే ముందున్నారని సంస్థ తెలిపింది. మొత్తం 22 మంది దేశాధినేతల్లో అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నారు మోడీ. అమెరికా అధ్యక్షుడు జోబైడన్ 41శాతం అప్రూవల్‌తో ఐదో స్థానంలో ఉన్నారు.63 శాతంతో మెక్సికో అధ్యక్షుడు అండ్రెస్ మాన్యువల్ ఉండగా 54 శాతంతో ఇటలీ ప్రధాని మూడో స్థానంలో నిలిచారు.