ఒడిశా సీఎం, బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. . రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించిన పట్నాయక్ తాను రెండు స్థానాల్లో బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు.
ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హింజీలీ స్థానంతో పాటు బలాంగీర్ జిల్లాలోని కాంటాబాంజీ నుంచి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. 2019లోనూ ఆయన హింజీలీతో పాటు బిజేపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బిజేపూర్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం హింజిలీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
కాగా ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేడీ ఇప్పటివరకు 126 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకా 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒడిశాలో 147 నియోజకవర్గాలు, 21 లోక్‌సభ స్థానాలకు గాను నాలుగు దశల్లో మే 13, 20, 25, జూన్1 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.