ఒడిశా అసెంబ్లీలో తానే ప్రతిపక్ష నేతగా ఉంటానని మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ( Naveen Patnaik ) చెప్పారు. పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. బీజేడీ ఎమ్మెల్యేలంతా తనను బీజేడీ సభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. 24 ఏళ్ల పాటు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ ఇటీవల అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. 78 సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఒడిశాను పాలించిన బిజు జనతాదళ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చవి చూసిన విషయం తెలిసిందే. మొత్తం 147 స్థానాలకు గాను భాజపా 78 సీట్లతో అధికారం కైవసం చేసుకోగా.. బిజు జనతాదళ్ 51, కాంగ్రెస్ 14, స్వతంత్రులు 1, సీపీఎం 1 స్థానాలు చొప్పున గెలుచుకున్నాయి. దీంతో భాజపాకు చెందిన ఆదివాసీ నేత మోహన్‌చరణ మాఝి ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.