Maharashtra : 6 అడుగుల సొరకాయ.. ఎర్ర బెండకాయ.. మార్కెట్ లోకి కొత్త వంగడాలు
మార్కెట్లోకి 4 నుంచి 6 అడుగుల పొడవైన గవాన్ సొరకాయలు అందుబాటులోకి వచ్చాయి. చిప్కో కంపెనీ మొత్తం 22 రకాల గర్రాన్ రకం సొరకాయ వంగడాలను సాగు చేసింది. తద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని బారామతిలో కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో 'వ్యవసాయ 2025' పేరుతో ఎగ్జిబిషను ఏర్పాటు చేశారు. ఇందులో 22 రకాల సొరకాయల సాగును చిప్కో కంపెనీ నమూనాగా ప్రదర్శించింది. ఇందులో 4 నుంచి 6 అడుగుల పొడవైన పాల సొరకాయలు, పెద్ద సొరకాయలు ఉన్నాయి.
ఎగ్జిబిషన్లో వివిధ కూరగాయలు, పండ్ల సాగు పద్ధతులను కూడా ప్రదర్శించారు. ఇప్పటివరకు మీరు మార్కెట్లో ఆకుపచ్చ బెండకాయలను చూసి ఉంటారు. కానీ ఈ ఎగ్జిబిషన్లో ఎర్ర బెండకాయల సాగును ప్రదర్శించారు. వీటిని ప్రజలు ఆసక్తిగా పరిశీలించారు. ఎర్ర బెండకాయలో ఐరన్ అధికంగా ఉంటుందని వ్యవసాయ కళాశాల విద్యార్థిని సువర్ణ లోఖండే తెలిపారు. ఇది మధుమేహం కలిగిన వారికి, గర్భిణులకు పోషకాహార వనరుగా ఉపయోగపడుతుంది. ఆకుపచ్చ బెండకాయను పండించినట్లే. దీన్నికూడా పండించొచ్చని సువర్ణ చెప్పారు. దేశంలోని మెట్రో నగరాల్లో దీనికి మంచి డిమాండ్ ఉందన్నారు.