CAA : సీఏఏను ఎవరూ అడ్డుకోలేరు: అమిత్ షా

Update: 2024-03-14 06:43 GMT

పౌరసత్వ (సవరణ) చట్టం అమలులోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత , ఈ చట్టాన్ని ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. రాష్ట్రాలు CAAని నిరోధించలేవని, కేంద్రం మాత్రమే పౌరసత్వాన్ని అనుమతించగలదని కూడా షా అన్నారు. "సీసీఏ ఎప్పటికీ వెనక్కి తీసుకోబడదు. మన దేశంలో భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించడం మా సార్వభౌమ నిర్ణయం. దానితో మేము ఎప్పటికీ రాజీపడము" అని అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

ఈ చట్టం అమలుపై అమిత్ షా మాట్లాడుతూ, "మైనారిటీలు లేదా మరే ఇతర వ్యక్తులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి పౌరసత్వాన్ని తీసివేయడానికి CAA లో నిబంధన లేదు"అని షా చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చిన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీ శరణార్థులకు హక్కులు, పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే CAA అని అన్నారు.

సీఏఏ ద్వారా బీజేపీ కొత్త ఓటు బ్యాంకును సృష్టిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణపై, హోం మంత్రి మాట్లాడుతూ, "ప్రతిపక్షాలకు వేరే పని లేదు, వారు చెప్పేది ఎప్పుడూ చేయరు". ఆర్టికల్ 370ని రద్దు చేయడం కూడా మా రాజకీయ ప్రయోజనాల కోసమేనని వారు చెప్పారు. ఆర్టికల్ 370ని తొలగిస్తామని 1950 నుంచి చెబుతున్నాం. సీఏఏ నోటిఫికేషన్ వెలువడే సమయంపై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించగా, అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ సహా ప్రతిపక్షాలన్నీ అబద్ధాల రాజకీయాలు చేస్తున్నాయని షా అన్నారు.

Tags:    

Similar News