Omicron Variant: భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ టెన్షన్.. తొలి కేసు నమోదు..
Omicron Variant: భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగుచూసింది.;
Omicron Variant: భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగుచూసింది. ముంబైలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు నమోదైంది. మరో వ్యక్తిలో కాపా వేరియంట్ నిర్ధారించారు. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అయితే.. ఆందోళన చెందాల్సిన పని లేదని వెల్లడించింది. ఎక్స్‌ఈ వేరియంట్‌పై అధ్యయనం జరుగుతోందని తెలిపింది. యూకేలో జనవరి 19న ఎక్స్‌ఈ తొలి కేసు నమోదైందని వెల్లడించింది. అటు.. డెల్టా వేరియంట్ కన్నా ఎక్స్‌ఈ వేగంగా విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడిప్పుడే కాస్తా కుదటపడుతున్నామన్న తరుణంలో యావత్ మానవాళికి కరోనా వైరస్ మహమ్మారి సవాలు విసురుతూనే ఉంది. రోజురోజుకూ తన రూపు మార్చుకుంటోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం పలు దేశాల్లో కొనసాగుతూనే ఉంది. చైనా, దక్షిణ కొరియాలో ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, యూరప్ దేశాల్లో కొత్త వేరియంట్ల కారణంగా క్రమంగా కరోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్నాయి.