CA Exams Postponed : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ .. సీఏ పరీక్షలు వాయిదా

Update: 2025-05-10 08:00 GMT

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ దేశవ్యాప్తం గా సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పరీక్షలు వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీ డియట్, ఫైనల్, పోస్ట్క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయని పరీక్షల షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. సమాచారం కోసం పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఐసీఏఐ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించింది. తరువాత షెడ్యూల్ ప్రకారం ఐసీఏఐ సీఏ పరీ క్షలు మే 2 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్ష 3,5,7 తేదీల్లో జరగాల్సి ఉండగా.. గ్రూప్ 2 పరీక్షలు మే 9,11,14 తేదీల్లో జరగాల్సి ఉంది. గ్రూప్ 1 ఫైనల్ పరీక్ష మే 2,4,6 తేదీల్లో నిర్వహించగా.. గ్రూప్ 2 పరీక్ష మే 8,10,13 తేదీల్లో జరిగింది. అనంతరం జరగనున్న పరీక్షలు ప్రస్తుతం వాయిదా పడ్డాయి.

Tags:    

Similar News