Indian Army : పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లు ఎప్పటికప్పుడు నేలమట్టం

Update: 2025-05-10 10:45 GMT

దాయాదిదేశం పాకిస్తాన్‌కు ఇండియన్‌ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్‌ నుంచి వస్తున్న డ్రోన్లు, యుద్ద విమానాలను ఎప్పటికప్పుడు కూల్చివేస్తోంది. అంతేకాదు పాక్‌ రేంజర్లపై భారత బలగాలు విరుచుకుపడుతున్నాయి. దాంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ పాకిస్తాన్.. తప్పుడు ప్రచారానికి తెగబడుతోంది. భారత్‌లోకి ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్టు దుష్ప్రచారానికి దిగుతోంది. అయితే పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఇండియన్‌ ఆర్మీ ఖండించింది. భారత్‌లోని సిర్సా, సూరత్‌గఢ్‌ ఎయిర్‌బేస్‌లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రకటించింది. 

Tags:    

Similar News