ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) విదేశీ పర్యటన ముగిసింది. ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలో పర్యటించిన మోదీ.. తర్వాత ఆస్ట్రియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మాస్కోలో మోదీ రెండు రోజులు పర్యటించారు.
ఈ పర్యటన సందర్భంగా సోమవారం రాత్రి మోడీకి పుతిన్ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. రెండో రోజు ఇద్దరు నేతలు విస్తృత చర్యలు జరిపారు. రష్యా అధ్యక్షుడి ముందు ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం ఆయన మంగళవారం సాయంత్రం ఆస్ట్రియా బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ చాన్స్‌లర్ కర్ల్ నెహమ్మార్‌తో భేటీ కూడా అయ్యారు. తాజాగా రెండు దేశాల పర్యటనలు ముగించుకుని ప్రధాని స్వదేశానికి చేరుకున్నారు.