PM Modi : ప్రధాని మోదీ యూరప్ పర్యటన రద్దు

Update: 2025-05-07 10:45 GMT

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు దేశాల యూరప్ పర్యటన రద్దు చేసుకున్నట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. మే 13 నుండి 17 వరకు మోడీ క్రొయేషియా, నార్వే మరియు నెదర్లాండ్స్‌లకు వెళ్లాల్సి ఉంది. నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నార్వేను సందర్శించాల్సి ఉంది. ఆ సందర్శన రద్దు చేసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం గురించి ఆయా దేశాలకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు.

Tags:    

Similar News