హిమాచల్‌ ప్రదేశ్ లో వర్ష బీభత్సం.. 66 మంది మృతి, సిమ్లా, జోషిమట్ లో కూలుతున్న ఇళ్లు

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వర్షాల కారణంగా కనీసం 66 మంది మరణించారు.

Update: 2023-08-16 07:17 GMT

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వర్షాల కారణంగా కనీసం 66 మంది మరణించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఎడతెగని వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో 66 మంది మరణించారు, గాయపడిన వారిని రక్షించడానికి మరియు అనేక చోట్ల ఇళ్లు కూలిన కారణంగా మృతదేహాలను బయటకు తీయడానికి ఆపరేషన్ రెస్క్యూ కొనసాగుతోంది.

అత్యధిక మరణాలు హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించాయని, ఆగస్టు 13 న భారీ వర్షాలు ప్రారంభమైనప్పటి నుండి 60 మంది మరణించారని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లో మరియు మరో నాలుగు రోజుల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. 

మంగళవారం, కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల నుండి మూడు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. సిమ్లాలో కూలిన శివాలయం శిథిలాల నుండి ఒక మృతదేహాన్ని బయటకు తీయగా, నగరంలో తాజాగా కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మరణించారు. 

సిమ్లాలోని కృష్ణానగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఆరు తాత్కాలిక గృహాలతో సహా కనీసం ఎనిమిది ఇళ్లు కూలిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు బుధవారం మూసివేయబడతాయరి విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

వాతావరణ శాఖ మంగళవారం (ఆగస్టు 15) ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, ఆగస్ట్ 19 వరకు వచ్చే నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో జోషిమఠ్‌లోని పలు ఇళ్లు భూమి కుంగిపోవడంతో దెబ్బతిన్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి సమస్య తీవ్రమైందని అధికారులు వివరించారు. 


Tags:    

Similar News