Rahul Gandhi : ప్రియాంకను గెలిపించండి.. వయనాడ్ వదులుతూ రాహుల్ భావోద్వేగం

Update: 2024-06-24 07:45 GMT

వయనాడ్ పార్లమెంట్ స్థానంతో పాటు రాయబరేలీ నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ).. వయనాడ్ సీట్ ను వదులుకున్నారు. ఇక్కడి నుంచి రాహుల్ సోదరి ప్రియాంక ( Priyanka Gandhi ) వాద్రాను ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టనున్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. వయనాడ్ ను వదులుకోవడం బాధగా ఉన్నదని లేఖలో తెలిపారు. తాను ఎవరో తెలియనప్పుడే నన్ను నమ్మి, ఆదరించి ఎంపీగా గెలిపించి లోక్ సభకు పంపారనీ.. మీ గొంతుకను పార్లమెంట్లో వినిపించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

వయనాడ్, రాయబరేలి రెండింటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాననీ.. ఈ స్థానం నుంచి నా సోదరి ప్రియాంకను నిలిపేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిందన్నారు. నన్ను అభిమానించిన మాదిరిగానే ప్రియాంకను ఆదరించి ఎన్నుకుంటే బాగా పనిచేస్తుందనీ.. దేశంలో హింసను రెచ్చగొట్టే వారిపై కలిసి పోరాడుదాం అంటూ లేఖలో వయనాడ్ ప్రజలకు తెలిపారు రాహుల్ గాంధీ.

Tags:    

Similar News