భారత్‌లో రేపట్నుంచి (మార్చి 2) రంజాన్ మాసం మెుదలుకానున్నట్లు ఇస్లాం మతపెద్దలు ప్రకటించారు. శుక్రవారం దేశంలో ఎక్కడా నెలవంక దర్శనం కాకపోవడంతో ఆదివారం నుంచి ఉపవాసాలు చేపట్టనున్నారు. అయితే సౌదీఅరేబియాలో నెలవంక దర్శనం కావడంతో నేటినుంచి అక్కడ రంజాన్ మాసం ప్రారంభం కానుంది. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో సాధారణంగా చంద్రుడు కనిపిస్తాడని కానీ అక్కడి నుండి రంజాన్ చంద్రుడిని చూసినట్లు ఎటువంటి వార్తలు లేవని అహ్మద్ అన్నారు. అందుకే మొదటి ఉపవాసం మార్చి 2న అంటే ఆదివారం ఉండాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇస్లాంలో ఒక నెల 29 లేదా 30 రోజులు. ఒక నెలలో రోజుల సంఖ్య చంద్రుని దృశ్యమానతపై ఆధారపడి ఉంటుంది. శనివారం ఇస్లామిక్ క్యాలెండర్‌లోని ఎనిమిదవ నెల 'షాబాన్' నెలలో 30వ రోజు అని అహ్మద్ అన్నారు.