Range Rover Cars : భారీగా తగ్గనున్న రేంజ్ రోవర్ కార్ల రేట్లు.. ఇక ఇండియాలోనే తయారీ

Update: 2024-05-25 08:46 GMT

లగ్జరీ కార్ల డీటెయిల్స్ కావాలనుకునేవారికి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇది. టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి భారత్లోనే రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లను తయారు చేయనుంది. 54 ఏండ్ల చరిత్ర గల బ్రిటన్ కార్ల తయారీ బ్రాండ్ 'జాగ్వార్ లాండ్ రోవర్' తన కార్లను యునైటెడ్ కింగ్ డమ్ బయట తయారు చేయడం ఇదే తొలిసారి.

జాగ్వార్ లాండ్ రోవర్ ప్లాంట్ మాత్రమే రేంజ్ రోవర్, RR స్పోర్ట్ కార్లను తయారు చేసి భారత్ సహా 121 దేశాలకు ఎగుమతి చేస్తోంది. భారతీయ కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా, ధరల తగ్గింపుతో అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా జాగ్వార్ లాండ్ రోవర్ దేశీయంగా తన కార్ల తయారీకి సన్నాహాలు చేస్తున్నది. దేశీయంగా కార్ల తయారీ వల్ల ధరలు 18-22 శాతం తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు.

15 ఏండ్ల క్రితం జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థను టేకోవర్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కృషిని సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రశంసించారు.

Tags:    

Similar News