Ratan Tata: రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత

ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో జాయిన్..;

Update: 2024-10-07 06:45 GMT

ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ అధినేత రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  ప్రముఖ సామాజిక కార్యకర్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా   ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈరోజు (సోమవారం) ఉదయం ఆయనను ఆసుపత్రిలోని అత్యవసర గదికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, అర్ధరాత్రి 12:30 గంటల మధ్య రతన్ టాటా తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. రక్తపోటు విపరీతంగా పడిపోయింది.. దీంతో వెంటనే అతన్ని ఐసీయూకి తరలించగా.. అక్కడ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ అస్పి గోల్వాలా పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. రతన్ టాటా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తుమని వైద్య బృందం తెలిపింది.

ఇక, అయితే, 1937 డిసెంబరు 28న ముంబైలో రతన్ టాటా జన్మించారు. అతను టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జామ్‌సెట్‌జీ టాటా మునిమనవడు.. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా, అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగారు. టాటా గ్రూప్ ఛారిటబుల్ ట్రస్ట్‌లకు రతన్ అధిపతిగా కొనసాగుతున్నారు.


Tags:    

Similar News