భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎస్ జీ ఫిన్సర్వ్ లిమిటెడ్ కు 28.30 లక్షల జరిమానా విధించారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కు సంబంధించిన కొన్ని షరతులను పాటించనందుకు కంపెనీకి జరిమానా విధించబడింది. ఎస్ జీ ఫిన్‌సర్వ్‌ని ముందుగా ముంగిపా సెక్యూరిటీస్ అని పిలిచేవారు. ఆర్‌బిఐ ఎప్పటికప్పుడు ఆర్థిక సంస్థల నిబంధనలను పాటించని అంశాలపై నిఘా ఉంచుతుంది. కంపెనీలు, బ్యాంకులు నిఘాలో ఉండేలా జరిమానాలు వంటి చర్యలను కూడా తీసుకుంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ ఆర్థిక వివరాలలో సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన నిర్దిష్ట షరతులను పాటించలేదని ఇతర విషయాలతోపాటు వెల్లడించినట్లు ఆర్‌బిఐ తెలిపింది. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జారీ చేసిన నిర్దిష్ట షరతులను పాటించనప్పటికీ, కంపెనీ ప్రజల నుండి డబ్బును డిపాజిట్లుగా తీసుకొని రుణాలు ఇచ్చిందని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది