Red Alert : వచ్చే 5 రోజులు జాగ్రత్త.

Update: 2024-04-27 04:43 GMT

తెలంగాణలో వచ్చే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని, ఉ.11 నుంచి సా.4 వరకు బయటకు రావొద్దని సూచించింది. కరీంనగర్ , నల్గొండ, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ , వనపర్తి, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లు తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

రానున్న ఐదు రోజుల్లో తూర్పు, దక్షిణ భారతానికి తీవ్ర వడగాలుల ముప్పు పొంచి ఉందని IMD హెచ్చరించింది. ‘తెలంగాణ, ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్, బిహార్‌లో ఐదు రోజుల పాటు వడగాలులు ఉంటాయి. కోస్తాంధ్ర, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో ఈనెల 28-30 మధ్య తీవ్ర వడగాలులు వీస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, రాజస్థాన్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని తెలిపింది.

మండుతున్న ఎండల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 5 రోజులపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంటుందని పేర్కొంది. గత కొన్ని రోజుల కంటే 2,3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉంటుందని పేర్కొంది. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించింది. కాగా భానుడి ప్రతాపంతో హైదరాబాద్‌లోని పలు రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

Tags:    

Similar News