Yoga Guru Shivaanand : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివానంద కన్నుమూత

Update: 2025-05-05 08:00 GMT

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, యోగా గురువు బాబా శివానంద (128) కన్నుమూశా రు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతు న్న ఆయన వారణాసిలోని నివాసంలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. శివానంద 1896 ఆగస్టు 8న బ్రిటిష్ ఇండియా లోని సిల్లైట్ జిల్లాలో (ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది) జన్మించారు. ఆరేండ్ల వయస్సులోనే తల్లి, తండ్రిని కోల్పోయారు. దీంతో ఆయన్ను నబద్వీప్ (పశ్చిమ బెంగాల్) లోని గురూజీ ఆశ్రమానికి తీసుకువచ్చి గురు ఓంకారానంద గోస్వామి పెంచారు. పాఠశాల విద్య లేకుండానే యోగాతో సహా అన్ని ఆచరణాత్మక, ఆధ్యాత్మిక విద్యలను బోధించారు. గత 50 సంవత్సరాలు గా శివానంద 400 నుంచి 600 మంది కుష్టు రోగులకు సేవ చేశారు. 2019లో బెంగళూరు యోగా రత్న అవార్డుతో సత్కరించారు. యోగా రంగానికి శివానంద చేసిన సేవలకుగాను 2022లో కేంద్రం పద్మశ్రీతో సత్కరిం చింది. తెల్లని ధోవతి, కుర్తా ధరించి.. కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యం గా వచ్చి ఆయన ఈ పురస్కారాన్నిస్వీకరించడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. శివానంద మృతిపై ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన జీవితం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని అభివర్ణించారు.

Tags:    

Similar News