పశ్చిమ బెంగాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది. బారాసాత్, మథురాపుర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ బూత్‌లు ఉన్నాయి. రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదిక మేరకు EC ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ రీపోలింగ్ జరుగనుంది. కాగా శనివారం బెంగాల్‌లో ఆఖరి దశ పోలింగ్ జరగ్గా చాలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఓ బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యారు.
బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత హింస చెలరేగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సందేశ్ ఖాలీలో మహిళలు, పోలీసులు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 19 వరకు 400 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్ లోనే ఉండేలా ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికలయ్యాక శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతంలో శాంతిభద్రలకు భంగం కలగకుండా చూసేందుకు జూన్ 19 వరకు కేంద్రబలగాలు బెంగాల్ లోనే ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.