కాంగ్రెస్ నేత శాం పిట్రోడాకు ( Sam Piroda ) కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ( Kiran Rijiju ) మండిపడ్డారు. ఇలా జరుగుతుందని ప్రధాని మోదీ ఆనాడే చెప్పారని అన్నారు.
రూపురేఖలనుద్దేశిస్తూ భారతీయులను అవ మానపర్చిన రాహుల్ గాంధీ సలహాదారు పిట్రోడాకు మళ్లీ కీలక బాధ్యతల్లోకి ఇచ్చారని విమర్శించారు. ఇది తమను ఆశ్చర్యప ర్చలేదని.. ఎందుకంటే ప్రధాని మోదీ దీన్ని ముందుగానే ఊహించారని రిజిజు ట్విట్టర్ లో రాసుకొచ్చారు. దీంతోపాటు ఓ ఇంట ర్వ్యూలో మోదీ మాట్లాడుతున్న వీడియోను జత చేశారు. బీజేపీ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసింది.