Bharat Bandh : నేడు భారత్ బంద్: నోయిడాలో 144 సెక్షన్ విధింపు

Update: 2024-02-16 06:26 GMT

రైతు సంఘాలు శుక్రవారం (ఫిబ్రవరి 16)న భారత్ బంద్ పిలుపునివ్వడంతో గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు సిఆర్‌పిసి సెక్షన్ 144 కింద అనధికార బహిరంగ సభలపై నిషేధం సహా ఆంక్షలు విధించారు. ఇది జిల్లా అంతటా అమలు చేయబడుతుంది. అదనంగా, నోయిడాలో పలు ట్రాఫిక్ మళ్లింపుల గురించి పోలీసులు ఢిల్లీకి, బయలుదేరే ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో అసౌకర్యాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత వరకు మెట్రో రైలు సేవను ఉపయోగించుకోవాలని పౌరులను కోరారు.

రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా (SKM), ఇతర సంఘాలు పిలుపునిచ్చిన ప్రతిపాదిత నిరసన ప్రదర్శనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. "SKM, వివిధ సంస్థలు శుక్రవారం నిరసన ప్రదర్శనలు వంటి వివిధ కార్యక్రమాలను ప్రతిపాదించాయి. అందువల్ల, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 144 ఫిబ్రవరి 16 నుండి అమల్లోకి వస్తుంది" అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

పోలీసుల ఆదేశం ప్రకారం, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం, రాజకీయ లేదా మతంతో సహా అనధికార ఊరేగింపులు లేదా ప్రదర్శనలు నిషేధించబడతాయి. ఇక గ్రేటర్ నోయిడా, గౌతమ్ బుద్ధ నగర్ నుండి ఢిల్లీకి ఆనుకుని ఉన్న అన్ని సరిహద్దులలో ఢిల్లీ పోలీసులు, గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు భారీ భద్రతతో పాటు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News