Family Suicide : కారులో ఏడు మృతదేహాలు.. అప్పుల బాధతో ఆత్మహత్య

Update: 2025-05-27 10:30 GMT

హర్యానాలోని పంచకులలో కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభించాయి. పంచకులలోని సెక్టార్ 27లో ఒక ఇంటి ముందు ఆపి ఉంచిన కారులో ఈ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున జరిగింది. కారు పార్క్ చేసి ఉండడం గమనించిన స్థాని కుడు అక్కడికి వెళ్లి ఇక్కడ ఎందుకు పెట్టావని అడగగా.. తన పేరు ప్రవీణ్ మిట్టల్ అని.. బాగేశ్వర్ ధామ్ నుంచి తిరిగి వెళ్తున్నామని.. రాత్రి ఉండడానికి హోటల్లో రూమ్ దొరకక పోవడంతో అక్కడ ఆగినట్లు తెలిపాడు. కారును అక్కడి నుంచి మరో చోటుకి మార్చుకోవాలని సూచించాడు. కార్లో పలువురు అచేతన స్థితిలో పడి ఉండడాన్ని గమనించినట్లు స్థాని కులు పేర్కొన్నారు. దీంతో అతడిని నిలదీయ గా తమ కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకున్నారని.. తాను కూడా ఐదు నిమిషాల్లో చనిపోతానని చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిని ఆస్పత్రికి తరలించా రు. అప్పటికే ఆరుగురు మృతి చెందగా.. చికిత్స పొందుతూ ప్రవీణ్ ప్రాణాలు వదిలాడు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అప్పుల బాధతోనే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోం ది. డెహ్రాడూన్ నివాసి అయిన ప్రవీణ్ మిట్టల్ (42) సోమవారం తన కుటుంబంతో కలిసి బాగేశ్వర్ ధామ్ నిర్వహించిన హనుమాన్ కథా కార్యక్రమానికి హాజరు కావడానికి పం చకులకు వచ్చారని తెలుస్తోంది. మృతుల్లో ప్రవీణ్ మిట్టల్ తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలు (ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు) విగతజీవులుగా పడి ఉన్నారు.

Tags:    

Similar News